టాక్..ఒకే చోట బిగ్ స్టార్స్ పవన్, అజిత్ లు..?

Published on Apr 30, 2022 12:00 pm IST

మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర క్రేజ్ అనే పదానికి వస్తే గుర్తుకు వచ్చే కొందరు బిగ్ స్టార్స్ లో మన టాలీవుడ్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు అటు కోలీవుడ్ నుంచి థలా అజిత్ కుమార్ లు ఒకరు. అయితే ఆఫ్ లైన్ లో ఈ ఇద్దరికీ కూడా చాలా వరకు దగ్గర పోలికలే ఉంటాయి. అందుకే ఈ ఇద్దరి హీరోల మధ్య అభిమానులు కూడా ఎక్కువే ఉంటారు.

అలాగే రీసెంట్ గా ఈ ఇద్దరు స్టార్స్ నటించిన సినిమాలు “భీమ్లా నాయక్” మరియు “వలిమై” లు ఒక్క రోజు వ్యవధిలో వచ్చి మంచి విజయాన్ని కూడా నమోదు చేసాయి. అయితే ఇపుడు వీటికన్నా ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తుంది. ప్రస్తుతం అజిత్ తన 61వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా పవన్ తన భారీ సినిమా “హరిహర వీరమల్లు” షూట్ లో బిజీగా ఉన్నారు.

అయితే ఈ రెండు సినిమాలు షూటింగ్స్ కూడా హైదరాబాద్ లోనే అది కూడా దగ్గరదగ్గర సెట్స్ లోనే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిలో ఇంకా ఎంత క్లారిటీ ఉందో కానీ ఒకవేళ నిజం అయితే ఈ ఇద్దరు స్టార్స్ కలిసే అవకాశం ఉంటే ఆ ఫ్రేమ్ ఏమన్నా బయటకొస్తుందేమో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :