“బిగ్ బాస్ 5”..ఈ కంటెస్టెంట్ గ్రాఫ్ లాస్ట్ మినిట్ లో చేంజ్.?

Published on Dec 18, 2021 7:16 pm IST


తెలుగు బుల్లితెర దగ్గర అతి పెద్ద రియాలిటీ షో అయినటువంటి “బిగ్ బాస్” ఇప్పుడు తన ఐదవ సీజన్ ని కూడా ముగించుకోడానికి దగ్గరలో ఉంది. గత సీజన్ల లానే ఎంతో అట్టహాసంగా స్టార్ట్ అయ్యి అంతే ఎంటర్టైన్మెంట్ తో కొనసాగిన ఈ గ్రాండ్ రియాలిటీ గేమ్ షో ఫైనల్స్ కి రానే వచ్చింది. ఇక ఇప్పుడు ఈ ఫైనల్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి గాను ఎవరో ఒకరే విజేతగా నిలుస్తారు.

మరి వారిలో ఇప్పుడు ఒక్కొక్కరి వోటింగ్స్ శరవేగంగా మారుతున్నాయట. వారిలో ఓ కంటెస్టెంట్ గ్రాఫ్ అయితే ఫైనల్స్ కి వచ్చాక బాగా పడినట్టు తెలుస్తుంది. అతడు మరెవరో కాదు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ నే. ఈ కంటెస్టెంట్ కి మొదటి నుంచి కూడా మంచి క్రేజ్ ఉంది.

దానితోనే ఇప్పటి వరకు కూడా గేమ్ ఎలా ఉన్నా హౌస్ లో సర్వైవ్ అవుతూ వస్తున్నాడు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే ఫైనల్స్ లిస్ట్ లోకి క్వాలిఫై అయ్యిన షణ్ముఖ్ టాప్ 3 నుంచి టాప్ 4 కంటెస్టెంట్స్ లిస్ట్ లోకి పడ్డాడట. అంటే టైటిల్ విన్నింగ్ కాస్త దూరంగానే ఉన్నాడని చెప్పాలి. మరి ఈసారి టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారో..

సంబంధిత సమాచారం :