“బిగ్ బాస్ 5” మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ ఇండియన్ ట్రెండ్స్ లో అతడి పేరు!

Published on Nov 7, 2021 9:00 am IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సక్సెస్ ఫుల్ రన్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ గత సీజన్లతో పోలిస్తే కొన్ని అంశాలు మిస్సయ్యాయి అనే మాట కూడా ఉంది. ఇక ఇదిలా ఉండగా ప్రతీ సీజన్లో కూడా ఓ కంటెస్టెంట్ లేదా ఇద్దరు ముగ్గురికి మంచి క్రేజ్ ఈ షో ద్వారా వచ్చిన సందర్భాలు ఉన్నాయి.

అలానే ఈసారి ఓ కంటెస్టెంట్ పేరు వేల సంఖ్యల ట్వీట్స్ తో “మిస్టర్ పర్ఫెక్ట్ ఆఫ్ బిగ్ బాస్ 5 మానస్” ఇండియా వైడ్ ట్రెండ్స్ లో నిలిచింది. అతడే మానస్. షో స్టార్టింగ్ లో కాస్త పాజిటివ్ తోనే తన గేమ్ ని స్టార్ట్ చేసి తర్వాత కొన్ని నెగిటివ్ ఫీడ్ బ్యాక్ లు కూడా అందుకున్నాడు.

కానీ ఇప్పుడు మాత్రం బహుశా ఈసారి సీజన్లో ఇండియన్ వైడ్ ట్రెండ్స్ లో మొదటి పేరుగా ఏకంగా 75 వేలకు పైగా ట్వీట్స్ తో తనది నిలుపుకున్నాడు. దీనిని బట్టి మానస్ కి షో వీక్షకుల్లో మంచి ఆదరణ లభించింది అని చెప్పాలి. మరి ఇదే ఫైనల్ వరకు కొనసాగుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More