“సర్కారు వారి పాట”లో ఈ పార్ట్ ఎక్కువలానే ఉంది!

Published on Sep 8, 2021 4:15 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ స్టైలిష్ అండ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే మరియు ఇది వరకే మొన్న గోవాలో ఓ అదిరే యాక్షన్ సీక్వెన్స్ ని కంప్లీట్ చేసిన మహేష్ ఇప్పుడు స్టార్ట్ చేసిన కొత్త షెడ్యూల్ ని కూడా మరో అదిరే యాక్షన్ బ్లాక్ తోనే స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.

మరి గత షెడ్యూల్స్ లో కూడా యాక్షన్ బ్లాక్ లే ఎక్కువ ఉన్నాయి. దీనిని బట్టి సర్కారు వారి పాట లో యాక్షన్ సీక్వెన్స్ ల ఫీస్ట్ కాస్త ఎక్కువే ఉండేలా ఉందని చెప్పాలి. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ఈ ఫస్ట్ సింగిల్ కూడా త్వరలోనే రానుంది అని టాక్ ఉంది.. ఇక అలాగే ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :