వైజాగ్ లో బాలీవుడ్ హీరోకి ఘన స్వాగతం..!

Published on May 31, 2022 12:40 pm IST


పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలతో ఈ ఏడాది రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో బాలీవుడ్ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న సినిమా “బ్రహ్మాస్త్ర” కూడా ఒకటి. తెలుగులో “బ్రహ్మాస్త్రం” గా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సమర్పణలో రిలీజ్ కి వస్తుంది. అయితే ఈ సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ మరియు రణబీర్ సహా రాజమౌళి లు ఈ వైజాగ్ వస్తున్నారని కొన్ని రోజులు కితమే కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఇప్పుడు రణబీర్ విశాఖకు చేరుకోగా అక్కడ తన ఘన స్వర్గం దక్కడం ఆసక్తిగా మారింది. ఇప్పుడు దాని సంబంధిత కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. తన కార్ లో ఉండగా రణబీర్ కి అభిమానులు గజ మాలతో స్వాగతం చెప్పారు. మొత్తానికి అయితే ఇవన్నీ చూస్తుంటే రణబీర్ తన సినిమా కి మన తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చేలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :