“ఎన్టీఆర్ 30” లో ఈ బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్.?

“ఎన్టీఆర్ 30” లో ఈ బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్.?

Published on Nov 2, 2022 9:00 AM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు దర్శకుడు కొరటాల శివతో చేయనున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా తమ కాంబోలో రెండో సినిమాగా దీనిని ప్లాన్ చెయ్యగా దీనిపై అనేక అంచనాలు అయితే సెట్టయ్యాయి. మరి గత కొన్నాళ్ల నుంచి అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం మంచి సస్పెన్స్ గా మారగా ఇప్పుడు మొత్తానికి ఈ సస్పెన్స్ వీడినట్టుగా తెలుస్తుంది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా అయితే ఎప్పుడు నుంచో ఎన్టీఆర్ వర్క్ చెయ్యాలని ఉబలాట పడుతున్న బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ఈ అంశంపై అతి త్వరలోనే అధికారిక అప్డేట్ రానున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అయితే సంగీతం అనిరుద్ అందిస్తుండగా యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు