ఆ సినిమాకి మిస్సయినా “సీతా రామం”తో అందుకున్న హీరోయిన్.!

ఆ సినిమాకి మిస్సయినా “సీతా రామం”తో అందుకున్న హీరోయిన్.!

Published on Aug 6, 2022 9:00 AM IST

తెలుగు సినిమా దగ్గర తమ ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు అందుకోవడం అందులోని ఓ హీరోయిన్ కి అందులోనీ నటన పరంగా అందుకోవడం అనేది చాలా అరుదుగానే కనిపిస్తుందని చెప్పాలి. ఇప్పుడు అలాంటి అతి తక్కువ మంది హీరోయిన్స్ జాబితాలో అయితే డెఫినెట్ గా బాలీవుడ్ కి చెందిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు.

దర్శకుడు హను రాఘవపూడి దుల్కర్ సల్మాన్ తో చేసిన లేటెస్ట్ చిత్రం “సీతా రామం” లో మంచి పాజిటివ్ రిపోర్ట్స్ తో మొదలయ్యాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మృణాల్ కి అయితే మరింత అప్లాజ్ వినిపిస్తుంది. తన నటనతో ఈమె అయితే మెస్మరైజ్ చేసేసింది అని ఆడియెన్స్ నుంచి వినిపిస్తున్న మాట.

అయితే ఇలాంటి ఒక మంచి రోల్ బాలీవుడ్ లో “జెర్సీ” రీమేక్ లో చేసింది కానీ అక్కడ మాత్రం అంత గుర్తింపు అయితే తనకి కనిపించలేదు. కానీ తెలుగులో మాత్రం తన ఫస్ట్ సినిమా తోనే ఆమె అందుకుంది. మరి తెలుగులో ఈ టాలెంటెడ్ బ్యూటీ మరిన్ని సినిమాల్లో కనిపిస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు