“పుష్ప” ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో!

Published on Dec 5, 2021 3:04 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్ సినిమా “పుష్ప ది రైజ్”. పాన్ ఇండియన్ వైడ్ మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ భారీ సినిమా హిందీ రిలీజ్ కోసం కూడా అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు పుష్ప ట్రైలర్ కోసం మాత్రం తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఓ బాలీవుడ్ స్టార్ హీరో ఎగ్జైటింగ్ గా చెబుతున్నాడు.

మరి ఈ హీరో ఎవరంటే బాలీవుడ్ హిట్ చిత్రాలు హౌస్ ఫుల్, ఢమాల్ తదితర ఎన్నో చిత్రాల్లో నటించిన నటుడు రితేష్ దేశ్ ముఖ్. తన ట్విట్టర్ ఖాతా ద్వారా పుష్ప టీజర్ ని పోస్ట్ చేసి అల్లు అర్జున్ తన అవతార్ లో ఇన్ క్రెడిబుల్ గా కనిపిస్తున్నాడని రేపు రానున్న ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాని తాను తెలిపాడు. దీనితో పుష్ప కోసం బాలీవుడ్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్స్ కూడా ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతుంది.

సంబంధిత సమాచారం :