బిగ్ బాస్ 5: ఎలిమినేషన్ లో ఈ ప్రముఖ సెలబ్రిటీ!

Published on Nov 9, 2021 1:15 pm IST


స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ కుటుంబ సభ్యుల మధ్యన గట్టి పోటీ నెలకొంది. తాజాగా బిగ్ బాస్ లో మానస్, రవి, కాజల్, సిరి, షణ్ముఖ్ లు నామినేట్ అయ్యారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రముఖ యాంకర్ రవి ఎలిమినేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కాజల్ తో పాటుగా ఓట్ల లో రవి వెనుకబడి ఉన్నారు. ప్రస్తుతం ఫైట్ చాలా గట్టిగా ఉందని తెలుస్తుంది. రవి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు, అంతేకాక సోషల్ మీడియాలో సైతం మంచి ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. రవి ను ఎలిమినేషన్ ప్రక్రియ నుండి కాపాడటానికి అతని టీమ్ బయట ఏం చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More