చిరు, చరణ్ లతో మరో అదిరే సాంగ్ చేసిన డాన్స్ మాస్టర్.!

Published on Sep 20, 2021 10:00 am IST

ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గరే మెగాస్టార్ డాన్స్ కి ఉన్న క్రేజ్ వేరు.. మరి అదే గ్రేస్ లైన్ లో మెగా వారసులు కూడా డాన్స్ లో తమకంటూ సెపరేట్ బెంచ్ మార్క్ ని సెట్ చేసుకున్నారు. మరి మెగాస్టార్ మరియు మెగా తనయుడు రామ్ చరణ్ లు ఒకే ఫ్రేమ్ లో కనిపించి స్టెప్పేస్తే థియేటర్స్ షేక్ అయ్యిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మరి అలాంటి ఈ ఇద్దరికీ ఆల్రెడీ డాన్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ మళ్ళీ మరో అదిరే సాంగ్ కంపోజ్ చేసినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా ఆచార్య సినిమా మెగాస్టార్, చరణ్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ షూట్ లో శేఖర్ మాస్టర్ ఇద్దరితో కలిసి ఓ ఫోటో షేర్ చేసుకున్నాడు.

మళ్ళీ ఈ ఇద్దరు మెగాస్టార్స్ తో కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనంద పడుతున్నానని తెలిపాడు. అంటే ఆచార్యలో వీరి కాంబో నుంచి మరో అదిరే సాంగ్ వస్తున్నట్టే అని చెప్పాలి. మరి ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా కొరటాల శివ దర్శకత్వం వహించారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :