భీమ్లా’ పై ఈమాత్రం క్లారిటీ సరిపోతుందా.?

Published on Nov 19, 2021 8:01 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ల కాంబోలో దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్”. మళయాళ సినిమా “అయ్యప్పణం కోషియం” కి రీమేక్ గా ఇది తెరకెక్కుతుంది. మరి మాస్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ పట్లే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మొన్ననే థమన్ బర్త్ డే సందర్భంగా సినిమా జనవరి 12నే రిలీజ్ అవుతుంది అని స్ట్రాంగ్ అనౌన్సమెంట్ కూడా ఇచ్చారు. కానీ మళ్ళీ సినిమా వాయిదా పడొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నా నిన్న చిత్ర యూనిట్ మళ్ళీ రిలీజ్ డేట్ చిన్న క్లారిటీ ఇచ్చారు.

భీమ్లా సాంగ్ 20 మిలియన్ వీడియోలో సినిమా జనవరి 12 నే రిలీజ్ అవుతున్నట్టు డేట్ పొందుపరిచారు. దీనితో సినిమా మళ్ళీ క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. కానీ ఇది సరిపోతుందా లేక మళ్ళీ ఏమన్నా అనౌన్సమెంట్ ఇవ్వాలా అనేది ఆసక్తిగా మారింది. మరి ఈసారి సంక్రాంతి బరి ఎలా ఉంటుందో అన్నది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :