“బిగ్ బాస్ 5”..ఈ వారం ఈ కంటెస్టెంట్ అవుట్.?

Published on Oct 30, 2021 3:03 pm IST

తెలుగు స్మాల్ స్క్రీన్ కి చెందినటువంటి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. అలాగే మరోపక్క షో లో కాస్త అన్ని కోణాల మోతాదు కూడా పెరుగుతూ వెళుతుంది. అయితే మరి ప్రతీ వారం కూడా బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ఉంటుంది అని తెలిసిందే కదా అలా షో సగం అయ్యేసరికి కంటెస్టెంట్స్ కూడా ఒక్కొక్కరూ తగ్గుతూ వస్తున్నారు.

ఇక ఈవారాంతానికి వస్తే ఓ కీ కంటెస్టెంట్ ఎలిమినేటి అయ్యినట్టు తెలుస్తుంది. అతడే మిస్టర్ లోబో.. షో స్టార్టింగ్ నుంచి మంచి ఎంటర్టైనర్ గా స్టార్ట్ అయ్యిన లోబో ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాడట. గత కొన్ని రోజులుగా లోబో గేమ్ లో మార్పు రావడంతో అతడికి ఓట్ పర్సెంట్ బాగా తగ్గిపోయిందట. దీనితో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో అతడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తుంది. మరి దీనిలో ఎంతవరకు నిజముందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :