“బిగ్ బాస్ 5”..ఈ కంటెస్టెంట్ ఫాలోవర్స్ మరింత జాగ్రత్త పడుతున్నారు.!

Published on Dec 16, 2021 9:00 am IST

మన తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ గేమ్ షో అయినటువంటి “బిగ్ బాస్ సీజన్ 5” ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చేస్తుంది. దీనితో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ నడుమ రసవత్తర పోటీనే జరుగుతుంది. అయితే వారి ఫాలోవర్స్ కి ఉన్న అంచనాలు పక్కన పెడితే ఆల్రెడీ బిగ్ బాస్ 5 టైటిల్ విన్నింగ్ రేస్ లో వీజే సన్నీ, శ్రీరామ చంద్ర అలాగే షణ్ముఖ్ జస్వంత్ లు ఉన్న సంగతి తెలిసిందే.

అయితే సోషల్ మీడియాలో ఆడియెన్స్ పల్స్ ప్రకారం అయితే సన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఖచ్చితంగా సన్నీ విన్నర్ గా నిలుస్తాడని జెనరల్ ఫాలోవర్స్ కూడా భావిస్తున్నారు. అయితే ఈ సమయంలోనే సన్నీ ఫాలోవర్స్ జాగ్రత్త పడుతున్నారు. ఆల్రెడీ సన్నీ లీడింగ్ లో ఉన్నా లేకపోయినా రిలాక్స్ అవ్వకుండా కంటిన్యూస్ ఓటింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఇవన్నీ అతడిని విన్నింగ్ వరకు తీసుకురాగలవో లేదో చూడాలి. ఇంకోపక్క శ్రీరామ చంద్ర మరియు షన్ను లకి కూడా గట్టి సపోర్ట్ ఉంది. మరి వీరిలో ఎవరు టైటిల్ కైవసం చేసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :