బిగ్ బాస్ 5: ఓట్ల లో వెనకబడి ఉన్న వ్యక్తి ఎవరంటే?

బిగ్ బాస్ 5: ఓట్ల లో వెనకబడి ఉన్న వ్యక్తి ఎవరంటే?

Published on Oct 19, 2021 10:38 AM IST

బిగ్ బాస్ రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం రోజురోజుకీ మరింత ఆసక్తి గా కొనసాగుతుంది. ఈ వారం తొమ్మిది మంది నామినేట్ చేయబడ్డారు. అందులో ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అన్నే మాస్టర్ వెనకబడి ఉన్నట్లు తెలుస్తోంది. అందరిలో కూడా తక్కువ ఓట్లు కలిగి ఉండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అంతేకాక కాజల్ వంటి బలహీన పోటీ దారులకు ఎక్కువ ఓట్లు వస్తుండటం విశేషం అని చెప్పాలి.

నిన్న జరిగిన ఎపిసొడ్ లో అన్నే ఎక్కువ సేపు టార్గెట్ చేయబడింది అని చెప్పాలి. అలా ఉండటం ఇప్పుడు తనకి మరింత ఇబ్బంది అవుతుంది. అన్నే గత వారం లో కూడా వెనకబడి ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎప్పటి లాగే శ్రీరామ్ ఓట్ల లో ముందు వరుస లో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు