“బిగ్ బాస్ 5” సెన్సేషన్ గా ఈ కంటెస్టెంట్ పేరు.!

Published on Nov 14, 2021 1:00 pm IST

ఈసారి కూడా మన తెలుగు స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్లో కంటెస్టెంట్స్ క్రేజ్ మంచి ఆసక్తిగా మారుతూ వస్తుంది. వారం వారంకి ఒక్కో కంటెస్టెంట్ పేరు వీకెండ్స్ లో మారుమోగుతోంది. మొదటి నుంచి ఆల్రెడీ మంచి క్రేజ్ తో హౌస్ లోకి వెళ్లిన వారు కాకుండా తమ గేమింగ్ తో కూడా షో ఫాలోవర్స్ లో మంచి ఫాలోయింగ్ ని తెచ్చుకున్న కంటెస్టెంట్స్ కొందరు ఉన్నారు.

వారిలో శ్రీరామచంద్ర, మానస్ లు ఒకరు కాగా ఇప్పుడు ఈ లిస్ట్ లో బిగ్ బాస్ సెన్సేషన్ గా వీజే సన్నీ పేరు కూడా చేరిపోయింది. ఇదే బిగ్ బాస్ 5 సెన్సేషన్ వీజే సన్నీ అంటూ ట్విట్టర్ లో ఏకంగా 5 లక్షలకు పైగా ట్వీట్స్ పడ్డాయి. దీనిని బట్టి సన్నీ కూడా ఎంత గట్టి కంపిటేషన్ ఇస్తున్నాడో మనం అర్ధం చేసుకోవచ్చు. తన గేమ్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇదంతా ఆ ఎఫెక్ట్ అనే చెప్పొచ్చు. మరి ఈ ముగ్గురిలో ఫైనల్స్ వరకు ఎవరు వెళ్తారో చూడాలి ఇక.

సంబంధిత సమాచారం :

More