బిగ్ బాస్ 5: ఆ ఒక్క వ్యక్తి తప్ప మిగిలిన వారు అంతా నామినేషన్ లోనే!?

Published on Nov 1, 2021 3:00 pm IST

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వారాలు గడుస్తున్న కొద్ది షో లో ఎవరు చివరి వరకు కొనసాగుతారు అనేది ప్రేక్షకులలో మరింత ఆసక్తి ను పెంచేస్తుంది. అయితే ఈ వారం నామినేషన్లు చాలా టెన్షన్ గా ఉండనున్నాయి. ఒక కంటిస్టంట్ తప్ప మిగిలిన వారు అందరూ కూడా నామినేషన్ లోకి వచ్చే అవకాశం ఉంది.

షణ్ముఖ్ కెప్టెన్ గా ఉన్నందున నామినేట్ కాలేదు అని తెలుస్తుంది. గేమ్ ను మరింత టెన్షన్ గా మార్చేందుకు మిగిలిన సభ్యులను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వారం ఎవరు సేవ్ అవుతారు మరియు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మనకు క్లియర్ గా తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నా, అది కుదిరే విధంగా లేదని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More