‘బిగ్ బాస్ 5’..ఈ వారం ఈ కంటెస్టెంట్ అవుట్.?

Published on Sep 25, 2021 5:02 pm IST

ప్రస్తుతం తెలుగు స్మాల్ స్క్రీన్ వద్ద రెండు రియాలిటీ షో లు మంచి రసవత్తరంగా నడుస్తుండగా వాటిలో బిగ్ బాస్ కూడా ఒకటి. ఎంతో అట్టహాసంగా షురూ అయ్యిన ఈ గ్రాండ్ రియాలిటీ షో ఇప్పుడు మూడు వారాలు కంప్లీట్ చేసుకునే దిశగా వెళ్తుంది. అయితే మరి ప్రతి వారాంతంలో కూడా ఒక ఎలిమినేషన్ ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే.

మరి ఈ వారపు నామినేషన్స్ లో మానస్, శ్రీరామ చంద్ర అలాగే లహరి, ప్రియాంక మరియు ప్రియా లు ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నదానికి సమాధానం వినిపిస్తుంది. మరి లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ షో నుంచి రేపు లహరి వెళ్లిపోనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే లహరి విషయంలో కాస్త నెగిటివిటీ ఉంటూనే ఉంది సో ఇప్పుడు లహరి టైం వచ్చినట్టుగా టాక్. మరి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళేది ఎవరో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :