బిగ్ బాస్ 5: కుటుంబ సభ్యుల్లో తక్కువ ఓట్లు ఇతనికే!

Published on Oct 6, 2021 2:35 pm IST


బిగ్ బాస్ రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రోజురోజుకీ ఈ కార్యక్రమం లో ఊహించని పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వారం ఎనిమిది మంది సభ్యులు నామినేట్ చేయబడిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇందులో వెనుకంజ లో ఉన్నది మాత్రం విశ్వ. విశ్వ కు ఓట్లు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వ బలహీన లింక్ ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

విశ్వ ఈ ఆటను చాలా బాగా ఆరంభించినప్పటికీ, కొద్ది రోజులుగా కాస్త డల్ అయినట్లు తెలుస్తోంది. నాగార్జున సైతం ఇదే విషయాన్ని విశ్వ తో తెలపడం జరిగింది. అతనితో పాటు గా జెస్సీ కూడా వెనకంజ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య పోరాటం కూడా గట్టిగానే ఉంది. వీరి లో ఎవరు బయటికి వెళ్తారు అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :