బిగ్ బాస్ 5..ఈరోజు ఈ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్?

Published on Sep 19, 2021 3:50 pm IST


ఇండియన్ సూపర్ హిట్ స్మాల్స్ స్క్రీన్ గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ మన తెలుగులో కూడా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. మరి అంతకంతకు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ వస్తున్న ఈ గ్రాండ్ షో ఇప్పుడు రెండో వారపు ఎలిమినేషన్ కి వచ్చేసింది. అయితే ఆల్రెడీ కొంత మంది ఈ వారం నామినేషన్స్ లో ఉండగా వారిలో ప్రియాంకా, లోబో, అనీ మాస్టర్ లను నాగ్ సేఫ్ జోన్ లో ఉంచారు.

మరి ఇంకా డేంజర్ జోన్ లో ఉన్నటువంటి నటరాజ్ మరియు ఉమ లలో ఉమ ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యిట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాలి అంటే ఈరోజు రాత్రి టెలికాస్ట్ అయ్యే ఈ ఎపిసోడ్ ని చూడాల్సిందే. అలాగే నిన్ననే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు నితిన్ మాస్ట్రో టీం కూడా వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :