ఆస్కార్స్ కి ఈ కాంట్రవర్సియల్ బాలీవుడ్ చిత్రం?

Published on Sep 22, 2023 10:03 am IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన మాసివ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “జవాన్” రికార్డు వసూళ్లతో అదరగొడుతూ ఉండగా ఈ చిత్రం విషయంలో రీసెంట్ గా అట్లీ చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. ఈ చిత్రాన్ని ఆస్కార్స్ కి పంపుతామని దీనిపై తాను షారుఖ్ తో కూడా మాట్లాడుతాను అని చెప్పడం మిక్స్డ్ రెస్పాన్స్ ని తీసుకొచ్చింది.

అయితే ఇపుడు మరో బాలీవుడ్ చిత్రం అందులోని ఈ ఏడాది పెద్ద ఎత్తున కాంట్రవర్సీ రేపిన చిత్రం “ది కేరళ స్టోరీ” కూడా ఇండియా నుంచి నామినేషన్స్ కి పంపనున్నారని ఇప్పుడు తెలుస్తుంది. అదా శర్మ, సిద్ది ఇద్నాని తదితరులు నటించిన ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించాడు. మరి బాక్సాఫీస్ పరంగా భారీ హిట్ అయ్యిన ఈ చిత్రం ఇప్పటికీ ఓటిటి రిలీజ్ కాలేదు. మరి ఈ రేంజ్ కాంట్రవర్సీలో ఉన్న ఈ చిత్రం కూడా ఆస్కార్ కి పంపానుండడం ఆసక్తిగా మారింది. మరి చివరికి ఈ సినిమాల విషయంలో ఏమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :