“భారతీయుడు 2” లో కూడా ఈ క్రేజీ ఎపిసోడ్ ఉందా?

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ లో మంచి ఆసక్తి రేపుతున్న లేటెస్ట్ చిత్రాల్లో లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ సీక్వెల్ చిత్రం “భారతీయుడు 2” కూడా ఒకటి. మరి భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా నుంచి అనిరుద్ అందించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యి క్రేజీ రెస్పాన్స్ ని అందుకుంటుంది.

అయితే మొదట్లో ఈ సినిమా పట్ల చాలా మంది అంత ఆసక్తిగా లేరు. దీనికి కారణం “2.0” వైఫల్యం కూడా ఒక కారణం కావచ్చు కానీ ఇప్పుడు భారతీయుడు 2 మీద అందరిలో ఆసక్తి పెరుగుతుంది. మెయిన్ గా శంకర్ ఈసారి అంచనాలు అందుకుంటారని నమ్ముతున్నారు.

అలా భారతీయుడు 2 లో ఉండే సర్ప్రైజ్ లలో మరోసారి మొదటి పార్ట్ లో ఉండే విధంగా ఒక సాలిడ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సేనాపతి పై ఉండొచ్చని వినిపిస్తుంది. ఆ సినిమాలో సేనాపతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎంత పవర్ఫుల్ అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ యంగ్ కమల్ హాసన్ సీన్స్ ఈ సినిమాలో కూడా ఉంటాయని వినిపిస్తుంది.

అంతే కాకుండా మొన్న వచ్చిన సాంగ్ కూడా తనపైనే కావచ్చని కూడా టాక్. దీనితో మరోసారి శంకర్ తన మాయాజాలంతో సాలిడ్ ఫ్లాష్ బ్యాక్ ని టెక్నాలజీతో కమల్ ని యంగ్ గా చూపించే ప్రయత్నం చేసారని అనుకుంటున్నారు అంతా. మరి నిజంగా ఈ తరహా సన్నివేశాలు ఉన్నాయా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version