వరల్డ్ వైడ్ “RRR” ని విట్నెస్ చేసే రోజు ఇది.!

Published on Oct 13, 2021 6:00 pm IST


పాన్ ఇండియన్ వైడ్ ఎన్నో అంచనాలు ఉన్న భారీ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. అసలు ప్రపంచంలో ఈ కరోనా అధ్యాయం అనేది లేకపోయి ఉంటే అసలు ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడో రిలీజ్ అయ్యిపోయి ఉండేది.

ఇక ఎక్కడ వరకు ఎందుకో రెండో వేవ్ అనేదే లేకుంటే సరిగ్గా ఇదే రోజు ప్రపంచ వ్యాప్తంగా “RRR” సినిమా విజువల్ ట్రీట్ ని ఇచ్చేది.. ఎందుకంటే ముందు ఇదే అక్టోబర్ 13నే కదా మేకర్స్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసింది. అన్నీ సెట్టయ్యి ఉంటే ఆ భారీ సినిమాని ఈరోజు అంతా థియేటర్స్ లో కూర్చొని చూస్తూ ఉండేవారు.

మరి మరోపక్క ఆల్రెడీ ఈ భారీ సినిమా రిలీజ్ పై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. దీనితో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ ముఖ్యంగా ఇద్దరి హీరోల అభిమానులు అయితే ఈరోజు ఈ సినిమాని బాగా మిస్సవుతున్నారు. ఇక ఈ వెయిటింగ్ అంతా వచ్చే ఏడాది జనవరి 7 వరకు హోల్డ్ చేసి ఉంచాల్సిందే.

సంబంధిత సమాచారం :