ఇంట్రెస్టింగ్ బజ్..పవన్ కోసం సాలిడ్ స్క్రిప్ట్.?

Published on Oct 8, 2021 10:00 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు లేని విధంగా అనేక సినిమాలు టేకప్ చేస్తూ వస్తున్నాడు. మరి దాదాపు ఒక మూడేళ్ళ వరకు పలువు స్టార్ డైరెక్టర్స్ తో పవన్ సినిమాలు ఫిల్ అయ్యిపోగా ఇప్పుడు పవన్ కోసం మరో టాలెంటెడ్ దర్శకుడు స్ట్రాంగ్ సబ్జెక్టు తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది.

అతడు మరెవరో కాదో రీసెంట్ గా “రిపబ్లిక్” సినిమా ప్రశంసలు జల్లు అందుకున్న దర్శకుడు దేవా కట్ట. తాను ఇప్పుడు పవన్ కోసం ఒక పవర్ ఫుల్ సోషల్ డ్రామా స్క్రిప్ట్ ని పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ఇంకా ఎంతవరకు నిజమో కానీ ప్రస్తుతానికి అయితే ఈ టాక్ బయటకి వచ్చి వైరల్ అవుతుంది. ఈ కాంబోలో ఓ సినిమా పడితే చూడాలని చాలా మంది ఇప్పుడు కోరుకుంటున్నారు. మరి వాస్తవంగా ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :