వలిమై లోని ఆ అంశం పై అజిత్ ఫ్యాన్స్ కి పండగే!

Published on Feb 20, 2022 11:02 pm IST

అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వలిమై. ఈ చిత్రం ను పాన్ ఇండియా తరహా లో విడుదల చేయనున్నారు మేకర్స్. బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి మరియు జీ స్టూడియోస్ పతాకాల పై సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రం లో హుమ ఖురేషీ లేడీ లీడ్ రోల్ లో నటిస్తుండగా, టాలివుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రం పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అజిత్ కుమార్ నటిస్తున్న చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కానుండగా, ఈ చిత్రం లో బైక్ చేజింగ్ సన్నివేశాలు మాత్రం పీక్స్ లో ఉండనున్నాయి అని తెలుస్తోంది. ఈ విషయం లో అజిత్ ఫ్యాన్స్ కి పండగే అంటూ పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ నెల 24 వ తేదీన భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :