“భారతీయుడు 2” లో ఈ అంశాలే ఎక్కువ.!

Published on Feb 27, 2023 7:12 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ సినిమా “భారతీయుడు 2” కూడా ఒకటి. రెండున్నర దశాబ్దాల కితం వచ్చిన భారతీయుడు కి సీక్వెల్ గా చేస్తున్న ఈ సినిమా కోసం తమిళ్ ఆడియెన్స్ సహా మన దగ్గర కూడా ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ అయితే తెలుస్తుంది.

గతంలో శంకర్ భారతీయుడు సినిమాని ఎలా చూపించారో తెలిసిందే. కానీ ఈసారి సినిమా మాత్రం కంప్లీట్ గా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందట. మొత్తం అంతా పొలిటికల్ అంశాలే సినిమాలో ఎక్కువ ఉంటాయని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో అయితే శంకర్ మరోసారి తనన స్ట్రాంగ్ బేస్ తో రాబోతున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :