ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమాపై నేడు మేకర్స్ ఓ భారీ ప్రెస్ మీట్ ని నేషనల్ మీడియాతో పెట్టి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇందులోనే అనుకున్నట్టుగా రిలీజ్ డేట్ ని ఒక రోజు ముందుకు జరిపి ఈ డిసెంబర్ 5 డేట్ ని అనౌన్స్ చేశారు.
అయితే ఈ సినిమా మేకర్స్ ఈ ప్రెస్ మీట్ లోనే పుష్ప 2 లోని ఓ క్రేజీ ఎపిసోడ్ కోసం హైప్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో ఎప్పుడు నుంచో ఎక్కువగా వినిపిస్తున్న జాతర సీక్వెన్స్ కోసం తెలిసిందే. అదే ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ అంటూ కొనియాడారు. అలాగే ఈ ఎపిసోడ్ తమ సినిమాలో మాస్టర్ పీస్ అంటూ నిర్మాతలు చెబుతున్నారు. మరి ఇంతలా హైప్ ఇస్తున్న ఈ మ్యాడ్ సీక్వెన్స్ బిగ్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే.