‘విశ్వంభ‌ర‌’లో ఆ ఎపిసోడ్ హైలైట్ కానుందా..?

‘విశ్వంభ‌ర‌’లో ఆ ఎపిసోడ్ హైలైట్ కానుందా..?

Published on Jul 5, 2024 1:04 PM IST

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభ‌ర’పై ఇప్పటికే ప్రేక్ష‌కుల్లో సాలిడ్ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను యంగ్ డైరెక్ట‌ర్ వ‌శిష్ఠ తెర‌కెక్కిస్తుండ‌గా, పూర్తి సోషియో ఫాంట‌సీ మూవీగా ఇది రానుంది. ఈ సినిమాలో చిరు స‌రికొత్త లుక్ లో ఆడియెన్స్ ను థ్రిల్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇక ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్స్ లో జ‌రుగుతోంది.

అయితే, ఈ సెట్స్ లో ఏలియ‌న్ సెట‌ప్ కూడా ఉంద‌ని, ప్ర‌స్తుతం వాటికి సంబంధించిన షూటింగ్ జ‌రుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో విశ్వంభ‌ర అనే కొత్త ప్ర‌పంచాన్ని వెతుక్కుంటూ ప్ర‌యాణిస్తాడు. ఈ క్ర‌మంలో ప‌లు లోకాల‌ను దాటి వెళ్తుంటాడు. ఇందులో ఏలియ‌న్ల‌ను కూడా చూపించ‌బోతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఏలియ‌న్లతో చిరు చేసే కామెడీకి ఓ స్పెషల్ ట్రాక్ ఉండ‌నుంద‌ని.. ఈ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది.

ఇప్ప‌టికే 80 శాతం చిత్ర షూటింగ్ పూర్త‌య్యింద‌ని, డ‌బ్బింగ్ ప‌నులు కూడా ప్రారంభించారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా ఎంఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తోంది. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాను జ‌న‌వ‌రి 10న రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు