“బిగ్ బాస్ 5”..ఓటింగ్ లో వెనుకబడుతున్న ఫేమస్ కంటెస్టెంట్?

Published on Oct 27, 2021 11:04 pm IST


వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ కి మన తెలుగులో కూడా ఎలాంటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. ఇంకా చెప్పాలి అంటే మొత్తం ఇండియా లోనే భారీ ఎత్తున మన తెలుగులోనే రెస్పాన్స్ ని అందిస్తారు ఆడియెన్స్. మరి ఈ షో ఇంత రసవత్తరంగా సాగాలి అంటే కొంతమంది బాగా తెలిసిన మొహాలే షోలో కనిపించాలి. కానీ గడిచిన లాస్ట్ సీజన్లలలో ఇది కొంచెం మిస్సయ్యింది అని టాక్ ఉంది.

కానీ అలా టైం గడిచే కొద్దీ ఒక్కొక్కరి కోసం తెలుస్తుంది. మరి వారితో పాటుగా ముందే మంచి ఫేమ్ క్రేజ్ లో ఉన్న వాళ్ళు కూడా హౌస్ లోకి అడుగు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వారిలో ఈసారి సీజన్ కి యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ కూడా ఒకడు. అయితే షణ్ముఖ్ కి ముందు మంచి క్రేజ్ ఉండడం మూలాన భారీ లెవెల్లో ఓటింగ్స్ తో నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యిన సందర్భాలు ఉన్నాయి.

కానీ ఇప్పుడు మాత్రం షన్ను గేమ్ పరంగా తన ఓటింగ్ పర్సెంట్ డౌన్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎక్కువగానే పడుతున్నా అందులో కూడా తన గేమ్ పరంగా వెయ్యని వాళ్ళు ఎక్కువయ్యారట. మరి ఇక్కడ నుంచి అయినా షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో కాస్త యాక్టీవ్ గా ఉంటే ముందు రోజుల్లో విన్నర్ అవుతాడు అనే టాక్ నిజం చేసుకోగలడు.

సంబంధిత సమాచారం :

More