ఈసారి “బిగ్ బాస్”లో బాగా మిస్ అవుతుంది ఇదేనా.?

Published on Oct 27, 2021 6:08 pm IST


తెలుగు నాట అతి పెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఇప్పుడు విజయవంతంగా ఐదవ సీజన్ తో కొనసాగుతుంది. అయితే గత సీజన్ల లానే ఈసారి కూడా ఇంట్రెస్టింగ్ టాస్కులు డ్రామా తోనే షో కొనసాగుతున్నా ఏదో ఒక ఎలిమెంట్ మాత్రం బాగా మిస్సవుతున్నట్టు అనిపించొచ్చు. గత రెండు మూడు సీజన్లలో అది బాగా హిట్ అయ్యిన కాన్సెప్ట్ నే.. అదే ఓ ఇద్దరి కంటెస్టెంట్స్ మధ్య కెమిస్ట్రీ..

లాస్ట్ రెండు సీజన్స్ లో అయితే కొన్ని జంటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఈసారి మాత్రం ఇలాంటివి ఏవి కనిపించట్లేదు అని చెప్పాలి. ఉన్న వారిలోనే ఒక్కక్కరికీ ఇండివిడ్యువల్ గా ఫాలోవర్స్ హేటర్స్ ఉన్నారు తప్పితే ఓ జంట కలిసి ఉండే సూచనలు అయితే హౌస్ లో కనిపించట్లేదు. ఈసారి కొంచెం గ్లామ్, కెమిస్ట్రీ లాంటి ఎలిమెంట్స్ ని ఆశించే వారు ఈ సారి సీజన్లో మిస్ అయ్యినట్టే అని చెప్పాలి. మరి ముందు రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :