ఈ శుక్రవారం క్యాథరిన్ థ్రెసాకు చాలా కీలకం !


‘ఇద్దరమ్మాయిలయిలతో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి క్యాథరిన్ థ్రెసా ఆ తర్వాత తెలుగులో చాలా కాలం పెద్దగా సక్సెస్ చూడలేదు. దాంతో చల్ మంది దర్శకులు ఆమెను ఇద్దరు హీరోయిన్లున్న కథలకు మాత్రమే కన్సిడర్ చేస్తూ వచ్చారు. అలాంటి సిట్యుయేషన్లో కూడా ‘సరైనొడు’ లో బ్రహ్మాండంగా నటించి రెండవ హీరోయిన్ గానే అనేక మంచి మంచి అవకాశాలని సొంతం చేసుకుంది. కానీ ఆమె నటించిన తాజా చిత్రం ‘గౌతమ్ నంద’ మిక్స్డ్ టాక్ మాత్రమే తెచ్చుకోవడవంతో అది పెద్దగా ఆమెకు హెల్ప్ అయ్యేలా కనబడలేదు.

దీంతో ఆమె చేసిన, ఈ శుక్రవారం రిలీజ్ కానున్న రెండు చిత్రాలు ‘నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక’ ల ఫలితం ఆమెకు చాలా కీలకంగా మారింది. రానా సినిమాలో భిన్నమైన, బలమైన పాత్రలో కనిపించనున్న ఆమె బోయపాటి సినిమాలో కూడా ప్రాధాన్యమున్న పాత్రే చేసిందని టాక్. ఈ రెండు సినిమాలు గనుక హిట్టై, ఆమె పాత్రకు ప్రసంశలు దక్కితే క్యాథరిన్ కెరీర్ కొత్త మలుపు తీసుకోవడం ఖాయం. మరి కీలకమైన ఈ శుక్రవారం ఆమెకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూద్దాం.