వైరల్ : “RRR” లో ఈ ఇంట్రెస్టింగ్ మిస్టేక్ పట్టుకున్నారుగా..!

Published on May 27, 2022 11:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ ప్రాజెక్ట్ “రౌద్రం రణం రుధిరం” కోసం తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా అన్ని అంచనాలు రీచ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే థియేటర్స్ లో బ్లాస్టింగ్ హిట్ అయ్యిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో కూడా భారీ హిట్ కాగా ఒక్కో సీన్ పై మళ్లీ సోషల్ మీడియాలలో చర్చ గా మారాయి.

అయితే వాటిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర తీసిన మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ అంతే.. ఇప్పుడు ఆ సీన్ లోని చిన్న మిస్టేక్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ తన అడవి మృగాలతో దూకేటప్పుడు ఒకే బోనులో పులి తో పాటు రెండు దుప్పిలు కూడా ఉంటాయి. అసలు ఈ వింత ఏమిటో అని ఆడియెన్స్ దీన్ని చూసి సోషల్ మీడియాలో ఫన్నీగా షేర్ చేసుకుంటున్నారు. దీనితో ఈ ఫన్నీ మిస్టేక్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :