మహేష్ నెక్స్ట్ కి సెకండ్ హీరోయిన్ ఫైనల్ అయ్యిందా?

Published on Oct 22, 2021 9:25 pm IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ పెట్ల తో “సర్కారు వారి పాట” అనే సాలిడ్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ ఇంట్రెస్టింగ్ మాసివ్ ప్రాజెక్ట్ ను కూడా మహేష్ చెయ్యాల్సి ఉంది దీని తర్వాత రాజమౌళితో సినిమాలో మహేష్ పాల్గొననున్నాడు. ఇక ఇదిలా ఉండగా త్రివిక్రమ్ తో సినిమా పై మాత్రం ఇంట్రెస్టింగ్ బజ్ లు ఎప్పటికప్పుడు బయటకి వస్తూనే ఉన్నాయి.

అయితే త్రివిక్రమ్ ఎప్పుడు నుంచో ఫాలో అవుతున్న తన ట్రెండ్ లోనే ఈ సినిమాకి కూడా ఇద్దరు హీరోయిన్స్ సెంటిమెంట్ ని ప్లాన్ చేసారని ఉంది. అయితే ఫస్ట్ హీరోయిన్ గా ఆల్రెడీ పూజా హెగ్డే పేరు ఫిక్స్ కాగా సెకండ్ హీరోయిన్ కోసం ఇంకొంతమంది స్టార్ హీరోయిన్స్ పేర్లు ఆ మధ్య బయటకి వచ్చాయి కానీ ఇప్పుడు నటి మీనాక్షి చౌదరి ఫిక్స్ అయ్యింది అంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతమేర నిజముందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :