ఇంట్రెస్టింగ్..మహేష్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో ఈ హీరోయిన్ పేరు.!

Published on Nov 19, 2021 10:02 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ తన హ్యాట్రిక్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

దీని కోసం ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఇపుడు ఇంకో ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ లావణ్యా త్రిపాఠి పేరు రేస్ లోకి వచ్చిందట. ఆల్రెడీ పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ కాగా మరో హీరోయిన్ పేరు పట్ల కొంత కాలంగా సస్పెన్స్ నెలకొంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More