నితిన్ “మాచర్ల నియోజకవర్గం”లో ఐటెం నెంబర్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jul 3, 2022 11:50 am IST


టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “మాచర్ల నియోజకవర్గం” కూడా ఒకటి. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో మళ్ళీ నితిన్ నుంచి చాలా కాలం తర్వాత ఒక మాస్ సినిమా రాబోతుంది. అయితే ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. ఈ సినిమాలో ప్రముఖ స్టార్ నటి అంజలి ఒక స్పెషల్ ఐటెం సాంగ్ ని చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

సినిమాలో ఈ సాంగ్ లుక్ ని కూడా రివీల్ చేసి ఈ సాంగ్ ఏంటి అనేది రేపు అప్డేట్ అందిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ ఐటెం నెంబర్ ఎలా డిజైన్ చేసారో చూడాలి. ఇక ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించగా కృతి శెట్టి హీరోయిన్ గా క్యాథరిన్ కీలక పాత్రలో నటించింది. అలాగే శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఆగస్ట్ 12న రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :