ఇతర భాషల్లోకి లేటెస్ట్ హిట్ మూవీ “కాంతారా”

Published on Oct 6, 2022 12:00 am IST


రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కన్నడ చిత్రం కాంతారా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయిన రోజు నుండి మంచి సమీక్షలు అందుకోవడం మాత్రమే కాకుండా, సూపర్ పాజిటివ్ మౌత్ టాక్ ఉండటం తో బాక్సాఫీస్ వద్ద దూసుకు పోతుంది.

కన్నడ సంస్కృతులు, సంప్రదాయాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏంటంటే, ఈ సినిమాను ఇతర భాషల్లోకి కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు మేకర్స్. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ పల్లెటూరి డ్రామాలో సప్తమి గౌడ లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. రిషబ్ శెట్టి ఈ చిత్రం లో నటించడం మాత్రమే కాకుండా, తానే స్వయంగా దర్శకత్వం కూడా వహించాడు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, అజనీష్ లోక్‌నాథ్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి లు కీలక పాత్రల్లో కనిపించారు.

సంబంధిత సమాచారం :