ఇంట్రెస్టింగ్..”వారసుడు” లో ఈ హిట్ సాంగ్ రీమిక్స్..?

Published on Jun 26, 2022 1:06 pm IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “వారసుడు” కోసం అందరికీ తెలిసిందే. తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా విజయ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన మూడు లుక్ పోస్టర్ లకి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. మరి ఈ చిత్రంపై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

ఈ చిత్రంలో అయితే విజయ్ వింటేజ్ హిట్ సాంగ్ ‘అల్ తూట్టా బూపతి’ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సాంగ్ మన తెలుగులో కూడా ఉంది ప్రభాస్ నటించిన “రాఘవేంద్ర” చిత్రంలో సూపర్ హిట్ మాస్ సాంగ్ కలకత్తా పానేసినా చూసుకోగా కూడా ఉంది. ఒరిజినల్ తమిళ్ వెర్షన్ ని ఇప్పుడు వారసుడు లో ప్లాన్ చేస్తున్నట్టు టాక్ ఇదే నిజం అయితే ఏఈ సినిమా ఆల్బమ్ లో అదిరే సాంగ్ వస్తున్నట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :