బాలయ్య తో స్టెప్పులేయనున్న ఈ హాట్ బ్యూటీ!

Published on May 17, 2022 7:05 am IST

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో అఖండ ఒకటి. అఖండ చిత్రం విజయం తో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య, కొత్త ఎనర్జీతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. మేకర్స్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మరియు బాలయ్య బ్లాక్ సూట్‌లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో చాలా ఘాటుగా కనిపించారు.

ఇప్పుడు ఈ సినిమాలో రసవత్తరమైన మాస్ నంబర్ ఉంటుందని తెలుస్తోంది. ఈ పాటకు హాట్ బ్యూటీ డింపుల్ హయతి బాలయ్యతో స్టెప్పు లేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :