చరణ్ భారీ ప్రాజెక్ట్ కు ఈ హాట్ బజ్ నిజమేనట.!?

Published on May 9, 2021 9:03 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ భారీ ప్రాజెక్ట్ అనంతరం మరో సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో సినిమా ఓకే చేసాడు. దీనితో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఇంకో స్థాయికి వెళ్లాయి.

అయితే ఈ బెంచ్ మార్క్ కాంబినేషన్ లైన్ లోకి వచ్చిన దగ్గర నుంచి అనేక రకాల ఇంట్రెస్టింగ్ రూమర్స్ కూడా వచ్చాయి. అలా వాటిలో ఈ మధ్య బయటకు వచ్చిన ఓ ఆసక్తికర టాక్ నిజమే అన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాల్లో ఓ కీలక పాత్రకు గాను కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ను అనుకుంటున్నారని టాక్ ఉంది.

అయితే ఈ విషయం నిజమే అన్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కిచ్చా ప్రస్తుతం చర్చలు అయితే జరుగుతున్నాయని తెలిపాడట. దీనితో ఈ భారీ చిత్రంపై వచ్చిన బజ్ నిజమే అని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :