ఇంట్రెస్టింగ్..లోకేష్ కనగరాజ్, చరణ్ కాంబో ఇలా సెట్ కానుందా?

Published on Mar 15, 2023 3:00 pm IST

ప్రస్తుతం మన సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్న కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో గ్లోబల్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ ల కాంబో కూడా ఒకటని చెప్పాలి. గత కొంత కాలం నుంచి అయితే ఈ ఇంట్రెస్టింగ్ కాంబో ఉందని తెలిసిందే. కానీ దీనికి ఇంకా సమయం తీసుకోనుండగా అసలు ఈ కాంబో ఉంటుందా లేదా అనేది ఎంతవరకు నిజం అనే దానిపై ఆసక్తికర బజ్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది.

లోకేష్ మరియు చరణ్ ల ప్రాజెక్ట్ ఆల్రెడీ చర్చలో ఉందని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు లోకేష్ కనగరాజ్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు చర్చల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆల్రెడీ ఇదే సంస్థ చరణ్ తో కూడా ఓ సినిమాని లాక్ చేసుకున్నారు. కాకపోతే ఆ సినిమాకి ఇప్పుడు దర్శకుడు ఎవరు అనేది ప్రశ్నగా మారగా దీనికి సమాధానంగా లోకేష్ పేరు ఇప్పుడు ఎందుకు రాకూడదు అని తెలుస్తుంది. దీనితో ఈ రకంగా ఈ సెన్సేషనల్ కాంబో వర్కౌట్ అయ్యేలా ఉందని చెప్పాలి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :