“వీరమల్లు” కోసం నిధి కష్టం అంతా ఇంతా కాదు..తెలుసుకోవాల్సిందే

Published on Oct 10, 2021 8:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మొట్టమొదటి భారీ పాన్ ఇండియన్ సినిమా “హరిహర వీరమల్లు”. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ వండర్ పవన్ కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ సినిమాగా నిలిచింది అంటే అతిశయోక్తి లేదు.. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో గ్లామరస్ హీరోయిన్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా ‘పంచమి’ అనే అద్భుతమైన పాత్రలో నటిస్తుంది.

అయితే ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుంది తాను ఎలా వర్క్ చేస్తుంది అనే దానిపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాలానే ఆసక్తికర అంశాలు తెలిపింది. తాను గ్లామరస్ హీరోయిన్ గానే కెరీర్ స్టార్ట్ చెయ్యడంతో తనపై యూత్ లో ఒక నటిగా కంటే హాట్ బ్యూటీ గానే మంచి క్రేజ్ ఉంది అందుకే ఆ మార్క్ ని అధిగమించి ఒక నటిగా తనని తాను ప్రూవ్ చేసుకోడానికి వీరమల్లు సినిమా ఎంతో ఉపయోగపడుతుంది అని ఆమె తెలిపింది.

అంతే కాకుండా తన నటనకి ఈ సినిమాలో చాలా స్కోప్ ఉంటుందట ముందు ఉన్న నిధి అగర్వాల్ కి ఈ సినిమాలో కనిపించే పంచమి చాలా తేడా చూపిస్తుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపడే విధంగా తన పాత్రని క్రిష్ డిజైన్ చేసారని నిధి చెప్పింది. అంతే కాకుండా పర్టిక్యులర్ గా తన రోల్ కాస్ట్యూమ్స్ పరంగా కూడా చాలా కష్టతరంగా ఉంటుందట. ఆ నగలు, బట్టలు వేస్కొని కనీసం కాసేపు రెస్ట్ తీసుకునే వీలు కూడా ఉండదని అందువల్ల చాలా సార్లు ఒంటి నొప్పులు కూడా వచ్చేవని నిధి తెలిపింది.

కానీ ఫైనల్ గా మాత్రం తన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా వీరమల్లు సినిమా నుంచి తాను అందుకుంటానని నిధి కాన్ఫిడెంట్ గా చెప్పింది. సో ఈ సినిమా కోసం నిధి ఇంత కష్టపడిందట.. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :