మహేష్ కోనేరు విషయంలో వారిని మరింత బాధ పెడుతున్న అంశం!

Published on Oct 12, 2021 4:18 pm IST


తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత కొంత కాలం క్రితం సీనియర్ మోస్ట్ పి ఆర్వో బి ఏ రాజు గారి మరణం ఎంతలా కలచి వేసిందో దానిని మరచే లోపే ప్రముఖ నిర్మాత జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత ఆప్తులు వారి పి ఆర్వో మహేష్ కోనేరు ఈరోజు ఊహించని విధంగా తన తుది శ్వాస విడవడం మరింత కలచివేసింది. దీనితో సినీ ప్రముఖులు అంతా కూడా మహేష్ కోనేరుకి నివాళులు అర్పిస్తుండగా మరో అంశం చిత్ర పరిశ్రమలో వీక్షకులను మరింత బాధిస్తుంది.

తారక్ కి తనకి ఎంతటి అవినావ సంబంధం ఉందో అందరికీ తెలుసు. అలాగే ఎన్టీఆర్ సినిమాల పరంగా ఎప్పడికప్పుడు అప్డేట్స్ కూడా మహేష్ ఇస్తూ ఉంటారు. కానీ అలాంటి మహేష్ తారక్ చేసిన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” సినిమా చూడకుండా ఆ తర్వాత తారక్ అందుకునే ఉన్నత శిఖరాలను చూడకుండానే వెళ్లిపోయారు అనే అంశం ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానుల హృదయాలను మరింత ముక్కలు చేస్తుంది. దీనితో వారు మరింత విచారం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :