పవన్ ఖరీదైన గిఫ్ట్ వెనుక ఇంత ఎమోషన్ దాగి ఉందా!?

పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకి ఒక లైఫ్ టైం సినిమాలా “ఓజి” అనే చిత్రాన్ని తన ఫ్యాన్స్ లో ఒకడైన దర్శకుడు సుజీత్ అందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఏదొక సందర్భంలో ఈ సినిమా మాట వస్తుంది సోషల్ మీడియాలో. మరి అలాంటి సినిమా ఇచ్చిన తనకి ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక ఖరీదైన బహుమానం ఇచ్చిన విషయం వైరల్ అయ్యింది. కానీ అసలు పవన్ ఎందుకు ఆ కార్ ని గిఫ్ట్ ఇచ్చారు. దాని వెనుక ఉన్న ఊహించని బ్యాక్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతుంది.

అసలేం జరిగింది?

ఓజి షూట్ సమయంలో సుజీత్ తన పర్శనల్ ఇంట్రెస్ట్ తో సెపరేట్ గా కొన్ని స్టెప్స్ తీసుకున్నాడు. ఓజి కామిక్స్ ఐడియా ఇంకా మరిన్ని తన సొంత ఖర్చుతో చేసాడని ఆ మధ్య వినిపించింది. అలాగే తనకి ఎంతో ఇష్టమైన కారుని అమ్మి ఓజి షూటింగ్ కోసం ప్రత్యేకంగా తాను ఖర్చు చేసాడట. ఇదే పవన్ కళ్యాణ్ దృష్టికి ఆలస్యంగా రావడంతో తానే చలించి ఈ సినిమా తర్వాత మళ్ళీ కొత్త కార్ కొని సుజీత్ కి గిఫ్ట్ గా అందించారట.

ఆ సందేహాలకు కూడా చెక్?

చాలామంది పవన్ గిఫ్ట్ ఇచ్చేసారు కానీ కార్ మీద ఇన్స్టాల్మెంట్స్ లాంటివి సుజీత్ నే కట్టుకోవాలి అంటూ పలు ట్రోల్స్ కూడా పడ్డాయి. కానీ ఈ సందేహాలకు కూడా చెక్ చెప్పినట్టు తెలుస్తుంది. కార్ కొనివ్వడమే కాకుండా దానిపై ఉండే ఇన్స్టాల్మెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ నే ప్రతీ నెల భరిస్తారని సినీ వర్గాల ద్వారా తెలిసింది.

Exit mobile version