పుష్ప : నార్త్ ఆడియెన్స్ లో అల్లు అర్జున్ రూల్ కి ఇదే నిదర్శనం.!

మన టాలీవుడ్ హీరోస్ లో చాలా మందికి ఇండియా వైడ్ గా కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మరి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకడు. కేవలం తన తెలుగు సినిమాలు డబ్బింగ్ తోనే నార్త్ ఆడియెన్స్ లో ఆర్గానిక్ గా భారీ క్రేజ్ ని తను సొంతం చేసుకోగా దానిని థియేటర్స్ కి జనాన్ని రప్పించి వసూళ్లు కూడా కొట్టగలడు అని “పుష్ప” తో ప్రూవ్ చేసాడు.

ఇక ఇప్పుడు పుష్ప 2 తో దీనిని మరింత గట్టిగా వినిపించేలా చూపిస్తున్నాడు. అయితే నార్త్ ఆడియెన్స్ లో అల్లు అర్జున్ కి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంది అనేది ఇప్పుడు పుష్ప 2 ఫస్ట్ సాంగ్ తో మరోసారి ప్రూవ్ అయ్యింది. నిన్న పాన్ ఇండియా భాషల్లో ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయగా ఇందులో మన తెలుగు సాంగ్ రెస్పాన్స్ ని హిందీ వెర్షన్ డామినేట్ చేస్తుంది.

తెలుగు వెర్షన్ కి ఈ ఆర్టికల్ రాసే నాటికి 14 గంటల్లో 57 లక్షల వ్యూస్ వస్తే హిందీ వెర్షన్ కి మాత్రం ఏకంగా 77లక్షల పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా లైక్స్ పరంగా కూడ హిందీ సాంగ్ ని తెలుగు వెర్షన్ దాటలేదు. దీని బట్టి నార్త్ ఆడియెన్స్ లో అల్లు అర్జున్ రూల్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Exit mobile version