ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : గోవర్ధన్ గజ్జల – ఇద్దరి మధ్య జరిగే ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఇది!

దర్శకత్వంపై తపనతో ఉద్యోగాన్ని సైతం వదిలి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఎన్నారై గోవర్థన్ గజ్జల తెరకెక్కించిన మొదటి చిత్రం ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. ఈ శుక్రవారం విడుదలకానున్న ఈ సినిమాను గురించి అయన 123తెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమా రంగంలోకి రావాలని ఎప్పుడనిపించింది ?
జ) 2012 నుండి సినిమా తీయాలనే కోరిక నాలో ఉంది. అందుకోసమే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఫిలిం మేకింగ్ కోర్స్ కూడా చేశాను. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ కూడా చేయడంతో ఒక ప్రాజెక్టును హ్యాండిల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ పెరిగి ఈ ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ సినిమా చేశాను.

ప్ర) ఈ సినిమాపై ఎన్నాళ్లుగా వర్క్ చేస్తున్నారు ?
జ) సుమారు రెండేళ్ల నుండి ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేశాను. 1 ఇయర్ కథ రాసి, 1 ఇయర్ సినిమా చేయడానికి పట్టింది. షూటింగ్ మాత్రం కేవలం 38 రోజులు మాత్రమే తీసుకున్నాను. 96 లక్షల్లో ఫస్ట్ కాపీ రెడీ చేశాను.

ప్ర) సినిమాను ఎవరికైనా చూపించారు ?
జ) ఒక 300 మందికి ప్రివ్యూస్ వేసి చూపించాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ సినిమా క్వాలిటీ బాగుందని, స్క్రీన్ ప్లే కొత్తగా ఉందని అన్నారు.

ప్ర) జాబ్ వదిలేసి సినిమాల్లోకి రావడం రిస్క్ అనిపించలేదా ?
జ) అంటే సినిమాలంటే చానాళ్లుగా ఇష్టం. అది కాక నా బ్రదర్ ఇండస్ట్రీలో ఉన్నారు. పైగా లైఫ్లో ఎలాగూ సెటిల్డ్ కాబట్టి ఇప్పుడైతే రిస్క్ చేయొచ్చు అనిపించి చేశాను.

ప్ర) మీ బ్రదర్ ఏం చేస్తుంటారు ?
జ) మా బ్రదర్ కార్తీక్ రెడ్డి. ఆయన ‘అడ్డా’ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇప్పుడు మంచు విష్ణుతో ‘ఓటర్’ చేస్తున్నారు. ఆయన నాకు చాల సపోర్ట్ చేశారు.

ప్ర) మొదటి సినిమానే లవ్ స్టోరీని ఎంచుకోవడానికి కారణం ?
జ) అంటే లవ్ స్టోరీ అయితే ఎక్కువ మందికి కనెక్టయ్యే అవకాశముంది కాబట్టి దాన్నే ఎంచుకున్నాను. ఇందులో ఎమోషన్స్ ఉంటాయి.

ప్ర) మీ లవ్ స్టోరీలో కొత్త పాయింట్ ఏంటి ?
జ) ఇదొక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ. కానీ ఇద్దరి మధ్యే జరుగుతుంది. సాధారణంగా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అంటే ముగ్గురు ఉంటారు. కానీ ఇందులో ఇద్దరే ఉంటారు. అదే ఈ సినిమా ప్రత్యేకత.

ప్ర) ఇండస్ట్రీలో మీకెవరైనా సపోర్ట్ చేశారా ?
జ) అంటే ప్రస్తుతం నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ ఎలా చేయాలి, రిలీజ్ ఎలా ప్లాన్ చేయాలి అనే విషయాల్లో సహాయపడుతున్నారు.

ప్ర) రిలీజ్ కు థియేటర్లు కుదిరిరాయ ?
జ) ముందుగా సెప్టెంబర్లో రిలీజ్ చేసినప్పుడు ఈ తేదీకి ఎవరు లేరు. కానీ నెమమ్దిగా అందరూ వచ్చి జాయిన్ అవుతున్నారు. థియేటర్స్ కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నాయి. కానీ అన్ని సినిమాల మధ్య లవ్ స్టోరీ కాబట్టి ప్రత్యేకంగా ఉంటుందని రిలీజ్ చేస్తున్నాం. మంచి టాక్ వస్తే థియేటర్లు పెరిగే అవకాశముంది.

ప్ర) కేవలం షాట్ ఫిలిమ్స్ చేయడం వలన సినిమాకు కావాల్సిన అనుభవం వచ్చిందని అనుకుంటున్నారా ?
జ) వచ్చింది. షాట్ ఫిలిమ్స్ నేనే రాసుకుని, నేనే తీసుకుని, నేనే ఎడిట్ చేసుకుని, నేనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేసుకుని చూసుకుంటే ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాను, ఏది లా చేయాలి అనేది తెలిసింది. ఆ అనుభవంతోనే ఈ సినిమాను విజయవంతంగా తీశాను. సినిమా చూస్తే అనుభవం ఉన్న దర్శకుడు చేసినట్టే ఉంటుంది.

ప్ర) మీ హీరో హీరోయిన్ల గురించి చెప్పండి ?
జ) ఇందులో నటించిన వాళ్లంతా కొత్తవాళ్లే. హీరో చంద్రకాంత్ దత్త ఒక స్టేజ్ ఆర్టిస్ట్. చాలా టాలెంటెడ్. ఇక హీరోయిన్ రాధికా మెహరోత్రాని చంద్రకాంత్ సజెస్ట్ చేశాడు. ఆ అమ్మాయి కూడా థియేటర్ ఆర్టిస్టే. ఇక రెండవ హీరోయిన్ పల్లవి డోర.