లేటెస్ట్ : లారెన్స్ ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ

Published on May 15, 2023 9:02 pm IST

తొమ్మిదేళ్ల క్రితం బాబీ సింహా ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్న తమిళ్ మూవీ జిగర్తాండ. ఇక ప్రస్తుతం దానికి సీక్వెల్ గా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీ పై అక్కడి ఆడియన్స్ లో మరిన్ని అంచనాలు ఉన్నాయి. రాఘవలారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో ఎస్ జె సూర్య ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

విషయం ఏమిటంటే ఈ మూవీని రానున్న దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా దీనిని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంస్థ భారీ వ్యయంతో నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :