జబర్ధస్త్ కి నాగబాబు దూరం కావడానికి కారణం ఇదే..!

Naga Babu

మెగా స్టార్ తమ్ముడిగా ఏళ్ల తరబడి సినిమాలలో నటించినా రాని గుర్తింపు నాగబాబు జబర్ధస్త్ షో ద్వారా సంపాదించారు. తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రజాధరణ కలిగిన కామెడీ షో గా గుర్తింపు పొందిన ఈ కార్యక్రమంలో నాగబాబు నవ్వులు చాలా ఫేమస్. ఎంతో మంది ఆర్టిస్టులు జబర్ధస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో సినిమాలలో కమెడియన్స్ గా కొందరు హీరోలుగా కూడా సెటిల్ ఐయ్యారు. కాగా ఈ షో జడ్జి గా ఉన్న నాగబాబు తాను ఇకపై జబర్ధస్త్ షోలో కనిపించను అని చెప్పారు. తాను ఈ షో జడ్జిగా తప్పుకుంటున్నాను ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు.

ఏడేళ్లకు పైగా సాగిన నా జర్నీలో జబర్ధస్త్ నాకు చాలా ఇచ్చింది. అలాగే జబర్ధస్త్ కి నావలన కూడా ప్రయోజనం కలిగింది. నేను ఆర్థిక కష్టాలలో ఉన్నప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ షోలో చేసే అవకాశం ఇవ్వడం వలన నేను స్థిరపడగలిగాను, అందుకు ఆయనకు కృతజ్ఞలు. ఐతే కొన్ని సైద్ధాంతిక బేధాల వలన నేను ఈ షో నుండి బయటకి రావడం జరిగింది. అని చెప్పారు. గత కొద్దిరోజులుగా నాగబాబు జబర్ధస్త్ షో నుండి ఎందుకు బయటకి వచ్చారు అనే విషయంపై అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నాగబాబు స్వయంగా తన యు ట్యూబ్ ఛానల్ ద్వారా వివరణ ఇచ్చారు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version