లేటెస్ట్..”RRR” పై ఉన్న ఆ కంప్లైంట్ క్లియర్ అయ్యిందా.?

Published on Apr 1, 2022 1:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా ఇండియాస్ నెంబర్ 1 దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ సినిమా “రౌద్రం రణం రుధిరం” చిత్రం రిలీజ్ అయ్యి భారీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యిన మొదటి రోజు నుంచే సాలిడ్ పాజిటివ్ టాక్ తెచ్చుకోగా దానితో పాటుగా ఆడియెన్స్ లో ఓ విషయానికి సంబంధించి కాస్త నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

ఈ సినిమాలో చాలా వరకు డైలాగ్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగు తర్జుమా లేవని అక్కడక్కడా కొన్ని చోట్ల ఉన్నాయి తప్పితే మేజర్ గా మాత్రం అనేక సన్నివేశాల్లో తర్జుమా మిస్ అవ్వడంతో చాలా డైలాగ్స్ అందరికీ అర్ధం కాలేదు. దీనితో ఇప్పుడు మేకర్స్ అనేక చోట్ల ముఖ్యంగా బి,సి సెంటర్స్ లో ఉండే థియేటర్స్ కి మార్చిన ఆడియో ప్రింట్ ని అప్డేట్ చేసినట్టు తెలుస్తుంది. దీనితో ప్రస్తుతానికి అయితే ఈ కంప్లైంట్ క్లియర్ అయ్యినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :