“సర్కారు వారి పాట” లో ఈ కీలక ఎలిమెంట్ కూడా..!

Published on Apr 30, 2022 8:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల కాంబోలో తెరకెక్కించిన లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. మహేష్ అభిమానులు అయితే అంచనాలు ఈ సినిమాపై పెట్టుకోగా మేకర్స్ కూడా ఈ సినిమా హైప్ ని ఎక్కడా తగ్గించకుండా సాలిడ్ ప్రమోషన్స్ చేస్తూ రిలీజ్ కి ఇంకా కొంచెం సమయం ఉన్నా ఆల్రెడీ గట్టి ప్రమోషన్ లను స్టార్ట్ చేశారు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఇపుడు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని ఆసక్తికర డీటెయిల్స్ తెలుస్తున్నాయి. అలా లేటెస్ట్ గా ఈ సినిమాలో మంచి యాక్షన్, హ్యూమర్ అలాగే ఇతర ఎలిమెంట్స్ తో పాటుగా మరి కీలక ఎలిమెంట్ ఓ చిన్నపాటి సందేశం కూడా ఉంటుందట. ఇంతకు ముందు సినిమాల్లో కూడా మహేష్ మంచి సందేశాలను ఇచ్చే ప్రయత్నం చేసారు మరి అది ఈ సినిమాతో కూడా కొనసాగినట్టు ఉందని చెప్పాలి. మరి అదేంటో తెలియాలి అంటే ఈ మే 12వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :