టాలీవుడ్ లో ఇక ఈ సినిమాలు తగ్గనున్నాయా?

టాలీవుడ్ లో ఇక ఈ సినిమాలు తగ్గనున్నాయా?

Published on Nov 9, 2022 10:00 AM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మన తెలుగు సినిమా భారీ స్థాయిలో రైజ్ అవుతుంది. మరి ఇలా టైం గడుస్తున్నా కొద్దీ సినిమా పరిశ్రమలో కూడా పలు మార్పులు కూడా జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఓటిటి లో అనేక చిత్రాలు కూడా అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దీనితో అనేక భాషల్లో చిత్రాలు నార్మల్ గా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.

అయితే ఇంకా డబ్బింగ్ చిత్రాలు కూడా ఓటిటి నుంచి బాగానే వస్తున్నాయి. దీనితో ఇతర భాషల్లో బాగున్నవి రీమేక్ లు వచ్చినవి ఆల్రెడీ డబ్ అయ్యి పెద్దగా ఆదరణ అందుకోనివి మళ్ళీ రీమేక్ చేసి తెలుగులోనే రిలీజ్ చేసినవి కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి తెలుగులో తగ్గే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్ మొదలైంది.

ఇక మీద పలు మంచి సినిమాలు ఉంటే రీమేక్స్ చేసే ఛాన్స్ లు తగ్గి వాటినే డబ్ చేసి రిలీజ్ ప్లాన్ స్టార్ట్ అయ్యినట్టుగా సినీ వర్గాల్లో ఇప్పుడు నడుస్తున్న టాక్. మరి తాజాగా అయితే పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు కూడా అంతంత మాత్రమే బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ చేస్తున్నాయి. మరి ఇక ముందు అయితే ఈ రీమేక్ సినిమాలు మెల్లగా తగ్గడమే బెటర్ అని కూడా చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు