లేటెస్ట్.. ఈ తమిళ యంగ్ హీరోకి కూడా కోవిడ్ పాజిటివ్.!

Published on Jan 9, 2022 1:00 pm IST

ప్రస్తుతం మన దక్షిణాది సినిమా దగ్గర కరోనా ప్రభావం మళ్ళీ ఏ స్థాయిలో పెరుగుతూ వస్తుందో చూస్తూనే ఉన్నాము. ఒక పక్క టాలీవుడ్ మరియు మరో పక్క కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఈ కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండడం కాస్త ఆందోళనకరంగా ఉంది. అయితే ఇదిలా ఉండగా జస్ట్ ఈ రెండు రోజుల్లోనే అనేక మంచి సినీ తారలు కరోనా బారిన పడగా ఇప్పుడు కోలీవుడ్ కి చెందిన మరో స్టార్ నటుడు యంగ్ హీరో కరోనా బారిన పడినట్టు తెలిపాడు.

మరి ఆ హీరో మరెవరో కాదు తమిళ్ బ్లాక్ బస్టర్ “రాట్సాసన్” తెలుగులో “రాక్షసుడు” రీసెంట్ గా బై లాంగువల్ చిత్రం “అరణ్య” లో నటించిన నటుడు విష్ణు విశాల్. ఈ యంగ్ హీరో ఇప్పుడు తనకి కరోనా వచ్చినట్టుగా కన్ఫర్మ్ చేసాడు. ఈ 2022 పాజిటివ్ తో స్టార్ట్ అయ్యిందని రీసెంట్ గా నన్ను కలిసిన వారు అంతా కూడా టెస్ట్ చేయించుకోవాలని సూచించాడు. అయితే జస్ట్ రెండు రోజులు కితమే ఈ హీరో మహారాజ్ రవితేజ భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడని టాక్ కూడా వచ్చింది.

సంబంధిత సమాచారం :